Jani Master – Janasena : జనసేన పార్టీ ఆదేశాలపై మొదటిసారి స్పందించిన జానీ మాస్టర్.. కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం..

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Jani Master – Janasena : జనసేన పార్టీ ఆదేశాలపై మొదటిసారి స్పందించిన జానీ మాస్టర్.. కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం..

Jani Master First Reaction on Janasena Party Decision after came out from Jail

Updated On : January 2, 2025 / 3:37 PM IST

Jani Master – Janasena : జానీ మాస్టర్ ఇటీవల జైలుకెళ్లోచ్చిన సంగతి తెలిసిందే. ఓ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణలతో జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. నెల రోజుల పాటు జైల్లో ఉన్న జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం బెయిల్ పై బయటకి వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజులు ఎవరికీ కనపడకుండా ఉన్న మాస్టర్ ఇటీవలే మళ్ళీ తన వర్క్స్ మొదలుపెడుతున్నారు, బయటకు వస్తున్నారు.

తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక సంగతులు మాట్లాడారు కానీ కేసు ఇంకా కోర్టులో ఉండటంతో ఆ ఆరోపణలపై మాత్రం స్పందించలేదు. అయితే జానీ మాస్టర్ జనసేన పార్టీలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు రాగానే జనసేన పార్టీ జానీ మాస్టర్ ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

Also Read : Armaan Malik : పెళ్లి చేసుకున్న ‘బుట్టబొమ్మ’ సింగర్ అర్మాన్ మాలిక్.. ఫొటోలు చూశారా? పెళ్లికూతురు ఎవరో తెలుసా?

దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తూ.. జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయంతో బాధపడ్డాను. కానీ కొన్ని పార్టీ రూల్స్ ఉంటాయి. ప్రతిపక్షాలు దీన్ని ఆసరాగా తీసుకొని రాద్ధాంతం చేస్తారు. అందుకే కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను హ్యాపీనే. ఆ నిర్ణయం నేను తప్పు అని చెప్పను. నేను ఆ పొజిషన్ లో ఉన్నా అలాగే చేస్తాను. పార్టీ ఆదేశాల ప్రకారం నేను జనసేన పార్టీ పేరు వాడను. కానీ నేను రెగ్యులర్ చేసే సేవా కార్యక్రమాలు చేస్తాను అని తెలిపారు.

అలాగే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎవరైనా ఈ విషయంలో సపోర్ట్ చేసారా అని అడగ్గా జానీ మాస్టర్ సమాధానమిస్తూ.. కళ్యాణ్ సర్ సైలెంట్ గా ఉన్నారు, చరణ్ సైలెంట్ గా ఉన్నారు అని అందరూ అన్నారు. కళ్యాణ్ అన్నకు, చరణ్ అన్నకు నేనేంటో తెలుసు. నాకు నేను క్లీన్ గా బయటకు రావాలి. నాకు సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ జిందాబాద్ లేకపోతే కాదు అనేవాడ్ని కాదు. నా మనసులో వాళ్ళ మీద ప్రేమ ఇప్పటికి ఎప్పటికి ఇలాగే ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి విషయాల్లో సైలెన్స్ ఉండటమే మంచిది. వాళ్ళు సైలెంట్ గా ఉండటం నాకు హ్యాపీనే. నాగబాబు గారు, నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ నేను రుణపడి ఉంటాను. సపోర్ట్ చేస్తే ఒకలా, సపోర్ట్ చేయకపోతే ఒకలా ఉండను అని అన్నారు.

Also Read : SSMB 29 Shooting Update : మహేష్ – రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎక్కడో తెలుసా?

ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యే టికెట్ పై స్పందిస్తూ.. రాసిపెట్టి ఉంటే జరుగుతుంది. నేనెప్పుడూ పనిచేసుకుంటూ వెళ్తాను అని అన్నారు జానీ మాస్టర్. గతంలో జానీ మాస్టర్ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జానీ మాస్టర్ ఈ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.