SSMB 29 Shooting Update : మహేష్ – రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎక్కడో తెలుసా?
మహేష్ - రాజమౌళి సినిమా పూజా కార్యక్రమం నేడు జరిగింది.

Mahesh Babu Rajamouli SSMB 29 Movie Shooting Update
SSMB 29 Shooting Update : గత మూడేళ్ళుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మహేష్ – రాజమౌళి సినిమా పూజా కార్యక్రమం నేడు జరిగింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కేవలం రాజమౌళి ఫ్యామిలీ, మహేష్, నమ్రత, కొంతమంది సాంకేతిక నిపుణుల మధ్య ఈ పూజా కార్యక్రమం జరిగింది. రాజమౌళికి చెందిన స్థలంలో ఈ పూజ జరిగినట్టు తెలుస్తుంది.
Also Read : SSMB 29 : రచ్చ లేపుతున్న మహేష్ ఫ్యాన్స్.. ట్రెండింగ్‌లో SSMB 29.. పూజ ఫొటోలు అయినా రిలీజ్ చెయ్యండయ్యా..
బయట డెకరేట్ చేసిన కొన్ని విజువల్స్, మహేష్, రాజమౌళి కార్ లో వెళ్లిన విజువల్స్ తప్ప ఇంకేమి లీక్ అవ్వలేదు. మూవీ యూనిట్ కూడా అధికారికంగా ఎలాంటి ఫొటోలు, వీడియోలో రిలీజ్ చేయలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూజా కార్యక్రమాన్ని ఇంత సింపుల్ గా చేయడమేంటి, కనీసం ఫ్యాన్స్ కోసం ఫొటోలు అయినా రిలిజ్ చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే పూజ కార్యక్రమం సందర్భంగా సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు లీక్ అవ్వడంతో వైరల్ గా మారాయి. మహేష్ బాబు – రాజమౌళి సినిమా నేడు పూజ చేసారు కాబట్టి ద్వితీయ విఘ్నం ఉండకూడదు అని షూటింగ్ రేపు, ఎల్లుండి రెండు రోజులు హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం. అలాగే విజయవాడ దగ్గర్లో ఓ సెట్ నిర్మిస్తున్నారట. ఈ వారంలోనే ఆ సెట్ లో కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తారని టాక్. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇన్నాళ్లు లేట్ చేసినా ఇప్పుడు పూజ కార్యక్రమం అవ్వగానే షూటింగ్ మొదలుపెట్టేస్తున్నారు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Pushpa 2 Producers : హైకోర్టులో పుష్ప2 నిర్మాతలకు ఊరట..
ఇక రాజమౌళి RRR తర్వాత సినిమా కావడం, మహేష్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం, రాజమౌళి ఈ సినిమాను ఇంటెర్నేషనల్ రిలీజ్ చేస్తానని చెప్పడం, ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఇప్పట్నుంచే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి రాజమౌళి ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టి ఎన్నేళ్లకు సినిమా పూర్తిచేస్తారో చూడాలి.