SSMB 29 : రచ్చ లేపుతున్న మహేష్ ఫ్యాన్స్.. ట్రెండింగ్‌లో SSMB 29.. పూజ ఫొటోలు అయినా రిలీజ్ చెయ్యండయ్యా..

RRR వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంకా మహేష్ బాబు సినిమా అప్డేట్స్ కాదు కదా షూటింగ్ కూడా మొదలు కాలేదు.

SSMB 29 : రచ్చ లేపుతున్న మహేష్ ఫ్యాన్స్.. ట్రెండింగ్‌లో SSMB 29.. పూజ ఫొటోలు అయినా రిలీజ్ చెయ్యండయ్యా..

Mahesh Babu Fans Trending about Mahesh Rajamouli SSMB29 Movie in Twitter

Updated On : January 2, 2025 / 2:00 PM IST

SSMB 29 mOVIE : రాజమౌళి – మహేష్ బాబు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు మొదటి పాన్ ఇండియా కావడం, RRR లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ RRR వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంకా మహేష్ బాబు సినిమా అప్డేట్స్ కాదు కదా షూటింగ్ కూడా మొదలు కాలేదు.

ఇప్పటికే మహేష్ బాబు – రాజమౌళి సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, లొకేషన్స్ కూడా ఓకే చేసారని, పలు వర్క్ షాప్స్ కూడా నిర్వహించారని, మహేష్ కొన్ని స్పెషల్ ట్రైనింగ్స్ కూడా తీసుకున్నారని పలువురు రాజమౌళి టీమ్ మాట్లాడారు. ఇక ఈ సినిమా ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Sandhya theatre incident : హైకోర్టులో పుష్ప‌2 నిర్మాత‌ల‌కు ఊర‌ట‌..

ఇప్పటికి సినిమా షూటింగ్ మొదలుకాకపోయినా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అయితే పూజా కార్యక్రమం జరుగుతుందని లీకుల ద్వారా సమాచారం బయటకి రావడమే తప్ప ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక పూజ జరిగే ప్లేస్ బయటి విజువల్స్, రాజమౌళి, మహేష్ పూజా కార్యక్రమానికి వెళ్లినట్టు వాళ్ళ కార్స్ వీడియోలు బయటకు వచ్చాయి తప్ప ఒక్క ఫోటో కూడా రాలేదు.

దీంతో ఫ్యాన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. అసలు టీమ్ నుంచి ఎలాంటి చడీచప్పుడు లేకుండానే ఫ్యాన్స్ ట్విట్టర్లో రచ్చ చేస్తున్నారు. SSMB29, SSMBXSSRGloryBegins అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ హ్యాష్ ట్యాగ్స్ తో ఫ్యాన్స్ మహేష్ – రాజమౌళి సినిమా గురించి పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడే వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టేసినంత ఆనందంగా మహేష్ – రాజమౌళి పై పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక అధికారికంగా ఫొటోలు వస్తే ఇంకే రేంజ్ లో రచ్చ చేస్తారో.

Mahesh Babu Fans Trending about Mahesh Rajamouli SSMB29 Movie in Twitter

Also Read : Game Changer : రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ సెన్సార్ పూర్తి.. ర‌న్ టైమ్ ఎంతో తెలుసా..?

మూవీ టీమ్ నుంచి ఎలాంటి వీడియోలు, ఫొటోలు రాకపోవడంతో పలువురు ఫ్యాన్స్ తామే ఎడిట్ చేసుకొని కొత్త కొత్త పోస్టర్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ ఫ్యాన్ మేడ్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇవాళ సాయంత్రం వరకైనా మహేష్ – రాజమౌళి సినిమా ఓపెనింగ్ ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేస్తారేమో చూడాలి. పూజా కార్యక్రమం అయితే అవుతుంది మరి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.