Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

Ram Charan Game Changer sensor complete
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇక ఈ చిత్ర రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలు.
ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ లు ఈ మూవీని నిర్మించారు. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, నాలుగు పాటలు అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచేశాయి.
Fish Venkat : సాయం చేసిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ అవుతూ థ్యాంక్స్ చెప్పిన ఫిష్ వెంకట్..
ఇక ఈ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఓ మల్టిప్లెక్స్ థియేటర్ లో సింపుల్ గా ఈ ట్రైలర్ లాంచ్ ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, ఎస్‌జే సూర్యతో పాటు పలువురు మూవీ టీమ్ హాజరుకానున్నారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ రాజమౌళి ముఖ్య అతిథధిగా రానున్నారు. ఆయన చేతుల మీదుగా సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ట్రైలర్ విడుదల కానుంది.
Anurag Kashyap : కూతురి పెళ్లి ఖర్చు కోసం ఇబ్బంది పడిన స్టార్ దర్శకుడు.. డబ్బుల కోసం నటుడిగా..