Fish Venkat : సాయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎమోష‌న‌ల్ అవుతూ థ్యాంక్స్ చెప్పిన ఫిష్ వెంక‌ట్‌..

క‌మెడియ‌న్‌గా, విల‌న్‌గా న‌టించి ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు సాధించారు ఫిష్ వెంక‌ట్‌.

Fish Venkat : సాయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎమోష‌న‌ల్ అవుతూ థ్యాంక్స్ చెప్పిన ఫిష్ వెంక‌ట్‌..

Pawan Kalyan Helping To Fish Venkat

Updated On : January 2, 2025 / 12:14 PM IST

క‌మెడియ‌న్‌గా, విల‌న్‌గా న‌టించి ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు సాధించారు ఫిష్ వెంక‌ట్‌. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన ఆది చిత్రంలో ఆయ‌న చెప్పిన తొడ గొట్టు చిన్న డైలాగ్ ను ఎవ్వ‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. దాదాపు వందకు పైగా చిత్రాల్లో, అంద‌రూ స్టార్ హీరోల‌తో న‌టించారు. కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ద‌య‌నీయ స్థితిలో ఉన్నారు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌కు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, షుగర్, బిపి వచ్చాయని చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని, ఫ్యామిలీ ఆర్థికంగా నష్టాల్లో ఉంద‌ని తెలిపారు. రామ్‌న‌గ‌ర్‌లోని త‌న నివాసంలో దుర్భ‌ర జీవితాన్ని గ‌డుపుతున్నట్లు చెప్పారు. ఈ విష‌యం తెలిసిన కొంత మంది ఆయ‌న‌కు ఆర్థిక సాయం చేశారు.

Rajamouli – Ram Charan : చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం రాబోతున్న దర్శక ధీరుడు.. రేపే ట్రైలర్ లాంచ్..

కాగా.. త‌న‌ ప‌రిస్థితి తెలిసి సినీ న‌టుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌లించిపోయార‌ని ఫిష్ వెంక‌ట్ తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఓ వీడియోను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం త‌న ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌న్నారు. త‌న‌కు షుగ‌ర్ వ‌చ్చి, బీపీ పెరిగి, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయ‌ని అన్నారు. రోజు విడిచి రోజు డ‌యాల‌సిస్ చేయించుకుంటున్న‌ట్లు చెప్పారు. త‌న‌కు తెలిసిన పెద్ద వాళ్ల‌ను క‌ల‌వ‌మ‌ని అంద‌రూ చెబుతున్నార‌ని అన్నారు. అయితే.. అలా సాయం అడ‌గ‌డం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు.

అయితే.. క‌ష్టాలు ఎక్కువ అవ్వ‌డంతో క‌ల‌వాల‌ని అనుకున్నాను. నా భార్య ప‌వ‌న్ స‌ర్‌ని క‌ల‌మ‌ని చెప్పింది. దీంతో ఇటీవల షూటింగ్ సమయంలో ఆయ‌న్ను క‌లిశాను. నా ప‌రిస్థితి తెలియ‌జేశాను. కిడ్నీ ట్రీట్మెంట్ విషయంలో నా తరపున చేయాల్సింది నేను చేస్తాను అని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఆర్థిక ప‌రిస్థ‌తి బాగోలేదు అంటే వెంట‌నే రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను నా బ్యాంకు ఖాతాలో వేశారు అని ఫిష్ వెంక‌ట్ చెప్పారు.

Anurag Kashyap : కూతురి పెళ్లి ఖర్చు కోసం ఇబ్బంది పడిన స్టార్ దర్శకుడు.. డబ్బుల కోసం నటుడిగా..

ప‌వ‌న్‌కు డబ్బు, పదవి మీద వ్యామోహం లేదన్నారు. ఆయనకు అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది