Rajamouli : చరణ్ ని అలా పిలుస్తాను.. నా పర్మిషన్ లేకుండా ఇకపై అలాంటివి చెయ్యకు.. చరణ్‌కు రాజమౌళి వార్నింగ్..
రాజమౌళి సినిమా గురించి మాట్లాడిన తర్వాత చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rajamouli Interesting Comments on Ram Charan in Game Changer Trailer Launch Event
Rajamouli – Ram Charan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ నేడు రిలీజయింది. ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించగా రామ్ చరణ్, శంకర్ తో పాటు అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, దిల్ రాజు హాజరయ్యారు. రాజమౌళి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు.
Also Read : Ram Charan – SSMB 29 : గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్లో రాజమౌళి – మహేష్ సినిమా గురించి మాట్లాడిన రామ్ చరణ్..
అయితే ఈ ఈవెంట్లో రాజమౌళి సినిమా గురించి మాట్లాడిన తర్వాత చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మాట్లాడుతూ.. నేను ఏ హీరోని ఒరిజినల్ పేర్లతో పిలవను. ఒక్కో హీరోని ఒక్కో పేరుతో పిలుస్తాను. రామ్ చరణ్ ని నేను హీరో అని పిలుస్తాను. మగధీర సమయంలో హీరో హీరో అనే పిలిచేవాడిని. చరణ్ అనడం కంటే కూడా నాకు రామ్ అని పిలవడం ఇష్టం అని అన్నారు.
అలాగే.. నువ్వు గుర్రం మీద సీన్స్ తీస్తే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి. ఆ షాట్స్ నావి, నువ్వు ఎవరికీ చేయడానికి లేదు. ఆ షాట్స్ రైట్స్ నావి. ఇప్పుడే రైట్స్ నాకు పేపర్ మీద రాసిచ్చేయి అని సరదాగా వార్నింగ్ ఇచ్చారు. రాజమౌళి తీసిన మగధీర సినిమాలో చరణ్ గుర్రం సీన్స్ చాలా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో చరణ్ హార్స్ రైడింగ్ అదిరిపోతుంది. బయట కూడా చరణ్ హార్స్ రైడింగ్ బాగా చేస్తాడు. ఈ సినిమాలో గుర్రం మీద షాట్స్ ఉండటంతో రాజమౌళి సరదాగా ఈ కామెంట్స్ చేశారు.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతికి విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రాగా ఇప్పుడు ట్రైలర్ వచ్చి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.