Game Changer : నేడే ‘గేమ్ ఛేంజ‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ మొద‌టి సినిమా ఈవెంట్‌..!

డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌

డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. ఇక నేడు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

శ‌నివారం సాయంత్రం రాజ‌మండ్రిలో ఈ వెంట్‌ను గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రుకానున్నారు.

Game Changer : గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ స్టోరీనా?

అబ్బాయి కోసం బాబాయ్ రాబోతుండ‌డంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. రాజ‌మండ్రితో పాటు చుట్టు పక్క‌ల నుంచి పెద్ద సంఖ్య‌లో అభిమానులు గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త‌ర‌లివ‌స్తున్నారు.

కాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ప‌వ‌న్ పాల్గొంటున్న తొలి సినిమా ఈవెంట్ ఇదే.

Pawan Kalyan : ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ తో పుస్తకాలు కొన్నా- పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

శ్రీవేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ క‌థానాయిక‌. శ్రీకాంత్, అంజ‌లి, ఎస్‌జే సూర్య లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.