Ram Charan Game Changer shooting resumes and teaser could be released in august
Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) జంటగా మరోసారి కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘గేమ్ చెంజర్’. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల మెగా వారసురాలు రాకతో ఈ మూవీ షూటింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు తిరిగి షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టాడు. ఇక రావడం రావడంతోనే యాక్షన్ షెడ్యూల్ తో దుమ్ము లేపనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
Vijay : 11 ఏళ్ళ తరువాత మరోసారి శంకర్ దర్శకత్వంలో విజయ్.. ఈసారి రీమేక్..? ఒరిజినల్..?
గేమ్ షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యిందని, యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నామని తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ ఆగష్టులో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఆగష్టు 15న ఈ మూవీ నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది.
Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ప్రీ టీజర్ చూశారా.. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్‌లో..
Jumping right into a riveting fight sequence. Back in action, truly! #Gamechanger pic.twitter.com/HKpjXeNfbH
— Shankar Shanmugham (@shankarshanmugh) July 11, 2023
కాగా ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో 50వ చిత్రంగా తెరకెక్కుతుండడంతో ఎక్కడ రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే.. ఈ మూవీకి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.