Site icon 10TV Telugu

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ అప్పుడే.. ఈసారైనా పక్కానా?

Game Changer

Game Changer

Game Changer : చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ మార్చి 27న రిలీజ్ అంటూ టాక్ నడుస్తోంది. కనీసం టీజర్ అయినా ఈ డేట్‌కి రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Sundaram Master : సక్సెస్ కొట్టిన ‘సుందరం మాస్టర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? వైవా హర్ష అదుర్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటికే చరణ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కాగా ఈ మూవీ టీజర్ మార్చి 27న రిలీజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం ప్రచారంలో ఉన్న డేట్‌కి అయినా టీజర్‌ని విడుదల చేస్తారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Operation Valentine : వరుణ్ కోసం రాబోతున్న మెగాస్టార్.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ వేడుక టైమ్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

గేమ్ ఛేంజర్ మూవీ విడుదల వాయిదాల మీద వాయిదాలు పడటం.. కొత్తగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. కనీసం టీజర్ రిలీజ్ డేట్‌పై అయినా మూవీ టీం క్లారిటీ ఇస్తుందని వారు వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్‌లో చరణ్, కియారా అద్వానీ, అంజలీ, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర మూవీ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

 

Exit mobile version