Sundaram Master : సక్సెస్ కొట్టిన ‘సుందరం మాస్టర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? వైవా హర్ష అదుర్స్..

రిలీజ్ డే మొదటి ఆట నుంచి సుందరం మాస్టర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Sundaram Master : సక్సెస్ కొట్టిన ‘సుందరం మాస్టర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? వైవా హర్ష అదుర్స్..

Viva Harsha Sundaram Master First Day Collections Report

Updated On : February 24, 2024 / 1:56 PM IST

Sundaram Master : వైవా షార్ట్ ఫిలింతో పేరు తెచ్చుకున్న హర్ష(Viva Harsha) ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా బిజీ అయ్యాడు. మొదటిసారి మెయిన్ లీడ్ లో వైవా హర్ష ‘సుందరం మాస్టర్’ అనే సినిమాతో వచ్చాడు. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన సుందరం మాస్టర్ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజయింది.

సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ డే మొదటి ఆట నుంచి సుందరం మాస్టర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచానికి సంబంధం లేని ఓ ఊరికి ఇంగ్లీష్ మాస్టర్ గా వెళ్లి సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు, నేర్చుకున్న జీవిత పాఠాలతో ఈ సినిమా సాగుతుంది. హీరోగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కొట్టాడు వైవా హర్ష.

Also Read : Operation Valentine : వరుణ్ కోసం రాబోతున్న మెగాస్టార్.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ వేడుక టైమ్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మొదటి రోజే సుందరం మాస్టర్ 2.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ చిన్న సినిమా, కమెడియన్ హీరోగా మారి చేసిన సినిమా మొదటి రోజే ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే విశేషమే. మొత్తానికి సుందరం మాస్టర్ సక్సెస్ కొట్టాడు. వైవా హర్ష అదుర్స్ అనిపించాడు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.