Ram Charan introduce his new friend through instagram
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. RRR తరువాత చరణ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతూ వస్తుంది. టాలీవుడ్ టు హాలీవుడ్ ఎంతోమంది తన ఫాలోవర్స్ అయ్యిపోయారు. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో రామ్ చరణ్ ఏ పోస్టు వేసిన ఇట్టే వైరల్ అయ్యిపోతుంది. తాజాగా చరణ్.. తన కొత్త ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. ఇంతకీ రామ్ చరణ్ కొత్త స్నేహితుడు ఎవరు..?
రామ్ చరణ్ కి గుర్రాలు అంతే ఎంతో ఇష్టమని తెలుసు. చిన్నప్పటి నుంచే గుర్రపై సవారీ చేస్తూ వాటితో ఫ్రెండ్‌షిప్ చేస్తూ వచ్చిన చరణ్.. సమయం దొరికితే వాటితోనే టైం స్పెండ్ చేస్తుంటాడు. ఇప్పటికే చరణ్ దగ్గర కొన్ని గుర్రాలు ఉన్నాయి. అయితే తాజాగా మరో గుర్రాన్ని తెచ్చుకున్నాడు. ‘నా స్నేహితుడు బ్లేజ్’ అంటూ ఆ గుర్రంతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి చరణ్ తెచ్చుకున్న ఆ కొత్త గుర్రాన్ని మీరుకూడా ఒకసారి చూసేయండి.
Also Read : Siddharth : నాకు నంది అవార్డు రాలేదు.. తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను..
ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. శంకర్ ఈ మూవీతో పాటు ఇండియన్ 2 ని కూడా తెరకెక్కిస్తుండడంతో గేమ్ ఛేంజర్ లేట్ అవుతూ వస్తుంది. సెప్టెంబర్ నెలలో ఒక షెడ్యూల్ మొదలుపెట్టుకోవాల్సింది. కానీ సడన్ గా ఆ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసి అక్టోబర్ కి పోస్టుపోన్ చేశారు. ఈ నెలలో ఒక లాంగ్ షెడ్యూల్ జరగనుందని సమాచారం. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు.. సూసైడ్ నోట్ లు రాసి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు.