Game Changer Trailer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వచ్చేసింది.. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు

మీరు కూడా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసేయండి..

Ram Charan Kiara Advani Game Changer Movie Trailer Released Watch Here

Game Changer Trailer : శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు ఆల్మోస్ట్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. అంజలి, కియారా అద్వానీ, SJ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, విశ్వంత్.. పలువురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Ram Charan : క్రికెటర్స్‌తో రామ్ చరణ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్..

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి టీజర్, నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. రిలీజయిన సాంగ్స్ అన్ని ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసేయండి..

Also Read : Jani Master – Janasena : జనసేన పార్టీ ఆదేశాలపై మొదటిసారి స్పందించిన జానీ మాస్టర్.. కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం..

ట్రైలర్ చూస్తుంటే.. సీఎంకి ఓ IAS ఆఫీసర్ కి మధ్య జరిగే పోరాటం, ఆ ఆఫీసర్ తండ్రికి గతంలో ఇదే సీఎంతో పోరాటం జరిగినట్టు, ప్రజల కోసం తండ్రి కొడుకులు నిలబడినట్టు తెలుస్తుంది. ప్రజల కోసం నిలబడే తండ్రి కొడుకుల కథ, ఓ రివెంజ్ డ్రామాలా గేమ్ ఛేంజర్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లతో కామెడీ కూడా బాగానే ఉండనుంది.

ఇక గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని AMB మల్టీప్లెక్స్ లో నిర్వహించారు. సంధ్య థియేటర్ అల్లు అర్జున్ ఘటన నేపథ్యంలో పబ్లిక్ ఈవెంట్ చేయకుండా కేవలం మీడియా ఆధ్వర్యంలోనే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.