Star Heros : కొత్త కొత్త లుక్స్ లో కనిపించబోతున్న స్టార్ హీరోలు.. లుక్కే ముఖ్యం బిగిలూ..

స్టార్ హీరోలంతా తమ అభిమానులను మెప్పించడానికి రాబోయే సినిమాల్లో కొత్త కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు.

Ram Charan Mahesh Babu Prabhas Star Heros Trying New Looks in their Upcoming Movies

Star Heros : స్టార్ హీరోలైనా సరే ఎప్పుడూ ఒకే లుక్ లో, ఒకే గెటప్ లో కనిపిస్తే బోర్ అయిపోతారు ఆడియన్స్. అందుకే ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఇంప్రెస్ చెయ్యడానికి కొత్త కొత్త క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు హీరోలు. స్టార్ హీరోలు కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు. కొత్త లుక్ తో పాటు ఇప్పటి వరకూ కెరీర్ లో చెయ్యని సరికొత్త క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

లేటెస్ట్ గా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న క్యారెక్టర్ కార్తికేయుడు. త్రివిక్రమ్ – అల్లుఅర్జున్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ క్యారెక్టర్ పై చర్చ జరుగుతోంది. మొన్నటి వరకూ పుష్పలో స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన బన్నీ త్రివిక్రమ్ సినిమాలో కార్తికేయుడిగా నటిస్తున్నాడంటూ రూమర్ బాగా వినిపిస్తోంది.

Also Read : Pushpa 2 : పుష్ప 2 ఓటీటీ రిలీజ్ అధికారికంగా అనౌన్స్.. రీ లోడెడ్ కి ఇంకో 3 నిముషాలు యాడ్ చేసి.. మళ్ళీ చూడాల్సిందే..

మహేశ్ బాబు ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా రాజమౌళి సినిమాలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రాజమౌళి ఏ హీరోనైనా డిఫరెంట్ గా చూపిస్తారు కాబట్టి ఈ సినిమాలో మహేశ్ బాబుని జంగిల్ మ్యాన్ గా చూపించబోతున్నారని సోషల్ మీడియా టాక్. అమెజాన్ అడవుల అడ్వెంచర్ యాక్షన్ డ్రామా కాబట్టి కౌబాయ్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఇప్పటికే మహేష్ ఇప్పటివరకు ఎప్పుడూ కనపడని కొత్త లుక్స్ లో ఫుల్ జుట్టు, గడ్డంతో కనిపించి ఫ్యాన్స్ కి హైప్ ఇచ్చారు.

చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో చరణ్ క్యారెక్టర్ గురించి కూడా చర్చ జరగుతోంది. రంగస్థలం, గేమ్ ఛేంజర్, ట్రిపుల్ ఆర్, మగధీర.. ఇలా చాలా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించిన చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో ఏం క్యారెక్టర్ చేస్తున్నాడో అంటూ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రా రస్టిక్ లుక్ లో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ లా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైతే ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో ఉన్నాడు చరణ్.

Also Read : Chiranjeevi : తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. ఇంతకంటే ఏం కావలి అంటూ చిరంజీవి తల్లి ఎమోషనల్..

ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. మారుతి సినిమా హార్రర్ థ్రిల్లర్ కావడం అందులో తాత పాత్ర పోషిస్తున్నాడు. అలాగే స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా, హను రాఘవపూడి సినిమాలో ఆర్మీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఇలా సినిమా ఆసినిమాకు కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్.

ఎన్టీఆర్ యాక్షన్ అవతార్ ని ఎలివేట్ చేసేలా గట్టిగా ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దేవరలో ఆల్రెడీ ఎన్టీఆర్ సీరియస్ యాక్షన్ లుక్ చూశారు ఆడియన్స్. అయితే అంతకు మించి ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న డ్రాగన్ లో మాఫియా డాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది.

ఇలా స్టార్ హీరోలంతా తమ అభిమానులను మెప్పించడానికి రాబోయే సినిమాల్లో కొత్త కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు. ఆ లుక్స్ కోసం బాగానే కష్టపడుతున్నారు కూడా.