RC-Gowtam : ‘జెర్సీ’ డైరెక్టర్‌తో రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు..

RC-Gowtam : ‘జెర్సీ’ డైరెక్టర్‌తో రామ్ చరణ్

Rc Gowtam

Updated On : October 15, 2021 / 12:10 PM IST

RC-Gowtam: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ‘ఆచార్య’ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ రిలీజ్ డేట్స్ లాక్ చేసేశారు.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

స్టార్ డైరెక్టర్ శంకర్‌తో దిల్ రాజు నిర్మాతగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ మూవీ ఈమధ్యే లాంఛ్ అయింది. ఇప్పుడు మరో ఫిలిం ఫిక్స్ చేసేసాడు. ‘జెర్సీ’ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలందుకున్న యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చరణ్ సినిమా చెయ్యబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Jersey Movie : క్రేజీ డేట్ లాక్ చేసేశారు..

యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా సందర్భంగా ఈ క్రేజీ మూవీ అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వడంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా పట్టాలెక్కనుంది. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. డిసెంబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.