Ram Charan : నానమ్మ అంటే చరణ్ కి ఎంత ఇష్టమో.. చరణ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?

షోలో రామ్ చరణ్ బోలెడన్ని విషయాలు పంచుకోగా చరణ్ తల్లి సురేఖ, నానమ్మ అంజనా దేవి మాట్లాడిన ఓ వీడియో కూడా షోలో ప్లే చేసారు.

Ram Charan Reveals his Closeness with Grandmother and his Favorite Food tells by Mother in Unstoppable Show

Ram Charan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి చరణ్ వచ్చి సందడి చేసాడు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా తాజాగా ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. మెగా – నందమూరి హీరోల స్పెషల్ ఎపిసోడ్ కావడంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ ని ఆసక్తిగా చూస్తున్నారు.

Also Read : Ram Charan : బాలయ్య గారి పిల్లలతో డిన్నర్.. బాలయ్య మా ఇంటికి వచ్చి.. చరణ్ ఆసక్తికర కామెంట్స్..

ఇక ఈ షోలో రామ్ చరణ్ బోలెడన్ని విషయాలు పంచుకోగా చరణ్ తల్లి సురేఖ, నానమ్మ అంజనా దేవి మాట్లాడిన ఓ వీడియో కూడా షోలో ప్లే చేసారు. ఈ వీడియోలో వీరిద్దరూ మాట్లాడుతూ.. చరణ్ కి నానమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. కిళ్ళీ అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు తినకూడదు అని చెప్పినా సీక్రెట్ గా తినేవాడు కిళ్ళీని. మా ఇద్దరికి ఫైటింగ్ లు పెడతాడు సరదగా. ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తాడు అని తెలిపారు.

ఇక చరణ్ నానమ్మ తో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడుతూ.. నానమ్మ మా దగ్గరే ఉంటుంది. షూటింగ్ దగ్గర్లో ఉంటే లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను. నానమ్మతో కలిసి భోజనం చేస్తాను. ఆ అరగంట ఆమెతో గడుపుతాను. ఆమెకు వచ్చిన పాత రెసిపీలు అన్ని మాతో షేర్ చేసుకుంటుంది. నేను, నానమ్మ ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఇప్పటి జనరేషన్ లాగే ఆలోచిస్తుంది. సరదాగా అమ్మకి, నానమ్మకి అత్తాకోడళ్ల మధ్య ఉండే ఫైటింగ్స్ పెడతాను అని తెలిపాడు.

Also Read : Pushpa 2 Reloaded Version : పుష్ప 2 మళ్ళీ వాయిదా.. సంక్రాంతి సినిమాల కోసం తగ్గిన అల్లు అర్జున్..