Ram Charan : ‘పెద్ది’ షూటింగ్ నుంచి ఫొటో షేర్ చేసిన చరణ్.. మీర్జాపూర్ మున్నా భాయ్ తో.. మాస్ లుక్ లో చరణ్ ఏమున్నాడ్రా బాబు..

తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫొటో లీక్ చేసారు.

Ram Charan Shares Peddi Movie Working Still

Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫొటో లీక్ చేసారు. షూటింగ్ గ్యాప్ లో రామ్ చరణ్, బుచ్చిబాబు సాన, దివ్యేందు శర్మ సరదాగా మాట్లాడుకుంటున్న ఫోటోని చరణ్ షేర్ చేసాడు. ఈ ఫొటో షేర్ చేసి.. హ్యాపీ హనుమాన్ జయంతి. పెద్ది యాక్షన్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ తో హార్డ్ వర్క్ తో కొనసాగుతుంది అని రాసుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ విలేజ్ సెట్ లో జరుగుతుందని సమాచారం.

Also See : Janhvi Kapoor : బాబోయ్.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జాన్వీ కపూర్ అందాల జాతర.. ఫొటోలు వైరల్..

మూవీ యూనిట్ కూడా సెట్ నుంచి ఈ ముగ్గురు కలిసి ఉన్న మరో ఫొటో షేర్ చేసింది. చరణ్ ఫ్యాన్స్ ఈ ఫొటోని వైరల్ చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 27 న రిలీజ్ కానుంది.

Also Read : Jaya Prakash Reddy : నాన్న చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు.. ఏ హీరో ఫోన్ చేయలేదు.. ఆయన కరోనాతో చనిపోలేదు.. జయప్రకాశ్ రెడ్డి కూతురు ఎమోషనల్..