Ram Charan : మా అమ్మ డ్రీం ప్రాజెక్ట్.. నాన్నతో ఈ సినిమా వల్ల ఎక్కువ టైం ఉన్నా..

ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. నాన్న గారితో ఈ సినిమా ఇంత బాగా చేశాను అంటే మీరే కారణం. 20 సంవత్సరాలలో మా నాన్న గారిని.......

Ram Charan

Ram Charan :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ”టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. నాన్న గారితో ఈ సినిమా ఇంత బాగా చేశాను అంటే మీరే కారణం. 20 సంవత్సరాలలో మా నాన్న గారిని చూసి నేర్చుకున్న దానికంటే మారేడుమల్లిలో 20 రోజుల్లో నాన్న గారితో కలిసి పని చేసి నేర్చుకున్నది ఎక్కువ. అలాంటి అవకాశం ఇచ్చిన కొరటాల శివ గారికి థ్యాంక్స్. రాజమౌళి గారి చేతిలోకి ఒక యాక్టర్ వెళ్లాడంటే సినిమా అయ్యేదాకా వదలరు. కానీ మొదటి సారి నాన్న గారి మీద రెస్పెక్ట్ వల్లో, మా అమ్మ డ్రీం ప్రాజెక్టు అని తెలిసిన తర్వాత నన్ను ఆర్ఆర్ఆర్ షూట్స్ మధ్యలో పర్మిషన్ ఇచ్చి ఆచార్య సెట్స్ కి పంపించారు. రాజమౌళి గారికి నా తరుపున, అమ్మ తరుపున, మా డైరెక్టర్ తరుపున, నాన్న గారి తరుపున థ్యాంక్స్. శివ గారితో మిర్చి నుంచి చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇవాళ నాన్న గారితో కలిసి చేయాలి శివ గారి డైరెక్షన్ లో అని రాసిపెట్టి ఉంది. కొరటాల శివ గారి సినిమాలన్నీ చూశాను. శివ గారి సినిమాల్లో యాక్టర్స్ చాలా కూల్ గా ఉంటారు అంతకు ముందు ఎంత మాస్ సినిమా చేసినా అని అనుకునే వాడ్ని. ఆచార్య చూసిన తర్వాత అది అర్థమైంది. శివ గారి రైటింగ్ లో అన్ని ఉంటాయి. ఆయన రైటింగ్ లో చేయడం నా అదృష్టం. ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ నాకు స్పెషల్ ఫిలిమ్స్. వాటితో పాటు ఆచార్య కూడా. నా మనసుకి చాలా దగ్గరైన క్యారెక్టర్ ఇది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. పూజా అరబిక్ కుతూతో ఇండియాని ఊపేసింది. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మొత్తం నిర్మాతలే.”

Rajamouli : చిరంజీవి గారు చరణ్ కి ఎలాంటి సలహాలు ఇవ్వరు

 

”డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ పేరు, ఇదంతా సినిమాల వల్లే. నాన్ కరప్ట్ ఇండస్ట్రీ అంటే అది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. ఇక్కడ సినిమాల మీద ప్యాషన్ ఉన్నవారే ఉండగలరు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు, మీ అందర్నీ పొందినందుకు నేను గర్విస్తున్నాను. నేను చదువుకోలేదు పెద్దగా. కానీ ఇంట్లోనే అన్ని నేర్పించారు. పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాత్రం చెప్పారు నాన్న. ఇలాంటి ఫాదర్ కి నేను పుట్టినందుకు నా అదృష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నాను కానీ అవుతున్నాను. చిన్నప్పుడు పొద్దున్న షూట్ కి వెళ్తే రాత్రికి వచ్చేవారు. కానీ ఈ సినిమా వల్ల 20 రోజులు కలిసే ఉన్నాం. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు. అయినా ఈ జన్మకి ఇది చాలు” అంటూ ఎమోషనల్ అయి ఏడ్చారు కూడా.

Pooja Hegde : స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.