Ram Charan Take Break From Peddi Movie Shoot and going to London
Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇటీవలే గ్లింప్స్ రిలీజయి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్ పెద్ది సినిమా షూట్ కు ఆల్మోస్ట్ 20 రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాడట.
రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9న ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ మైనపు విగ్రహ ఆవిష్కరణకు రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లబోతున్నాడు. ఆ తర్వాత మే 11న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR సినిమాని ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా కీరవాణితో RRR సాంగ్స్ ఆర్కెస్ట్రా నిర్వహించి, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో క్వశ్చన్ – ఆన్సర్స్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.
Also Read : Samantha : ‘సమంత’ సినిమాకు నాగచైతన్య మేనమామ సాయం.. ‘శుభం’ పలకబోతుంది..
దీంతో రామ్ చరణ్.. ఎన్టీఆర్ తో కలిసి ఈ ఈవెంట్ కి హాజరు కానున్నారు. రాజమౌళి కూడా ఈ ఈవెంట్లో భాగం కానున్నారు. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఈ ముగ్గురు కలిసి కనపడబోతుండటంతో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ అయ్యాక రామ్ చరణ్, తన భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో కలిసి యూరప్ లోనే వెకేషన్ కి వెళ్లనున్నారు అని సమాచారం. అలా మొత్తం అన్నిటికి కలిపి ఓ 20 రోజులు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ పెద్ది షూట్ లో జాయిన్ అవ్వనున్నాడు చరణ్.
Also Read : KillR : ‘కిల్లర్’ గ్లింప్స్.. అదరగొట్టిన జగతి మేడమ్