Samantha : ‘సమంత’ సినిమాకు నాగచైతన్య మేనమామ సాయం.. ‘శుభం’ పలకబోతుంది..

నాగచైతన్యతో సమంత విడిపోయినా రానాతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది సమంత.

Samantha : ‘సమంత’ సినిమాకు నాగచైతన్య మేనమామ సాయం.. ‘శుభం’ పలకబోతుంది..

Samantha Subham Movie Released by Suresh Babu

Updated On : April 30, 2025 / 4:19 PM IST

Samantha : సమంత ప్రస్తుతం నటిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ నిర్మాతగా సినిమాలు చేస్తుంది. సమంత నిర్మాతగా మారి మొదటగా ‘శుభం’ అనే సినిమా తెరకెక్కించింది. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసారు. హారర్ కామెడీతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సమంత దాదాపు 7 కోట్లు బడ్జెట్ పెట్టిందని సమాచారం.

అయితే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెండు పెద్ద సంస్థలే వచ్చాయట. నైజాం ఏరియాలో శుభం సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీ, సీడెడ్ లో మాత్రం శుభం సినిమాని నాగచైతన్య మేనమామ, నిర్మాత సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లేదా రానా స్పిరిట్ సినిమాస్ బ్యానర్ పై సమంత శుభం సినిమా రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.

Also Read : KillR : ‘కిల్లర్’ గ్లింప్స్.. అద‌ర‌గొట్టిన జగతి మేడమ్‌

నాగచైతన్యతో సమంత విడిపోయినా రానాతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది సమంత. అలాగే రానా, సురేష్ బాబు కూడా మంచి సినిమా ఉంటే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి శుభం సినిమా నచ్చి రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకు నిర్మాతగా సమంతకు ప్రాఫిట్స్ వచ్చాయని సమాచారం. థియేటరికల్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడయి సమంతకు దాదాపు ఓ మూడు కోట్లు ఈ సినిమాపై లాభాలు వచ్చాయని సమాచారం. మొత్తానికి సమంత నిర్మాతగా మొదటి సినిమాతో శుభం పలకబోతుంది.

Also Read : Bhogi : శర్వానంద్ కొత్త సినిమా అనౌన్స్.. పాన్ ఇండియా భోగి..