Ram Charan To Speak Uttarandhra Dialect For RC16
RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు.
RC16 Heroine : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో సీతారామం హీరోయిన్?
ఉప్పెన చిత్రం ఫేం బుచ్చిబాబు సానాతో తన కెరీర్‌లోని 16వ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చరణ్ ప్రకటించాడు. ఇక ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో చరణ్‌ను సరికొత్తగా చూపెట్టేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో చరణ్ మాట్లాడే భాషకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన స్లాంగ్‌లో మాట్లాడతుతాడట. దీని కోసం ఆయన ప్రత్యేకంగా ట్రెయినింగ్ కూడా తీసుకోబోతున్నాడట.
గతంలో రంగస్థలం సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబుకు ఇప్పుడు చరణ్‌తో ఈ భాషను పలికించడం కష్టం కాకపోవచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా చరణ్ కోసం బుచ్చిబాబు ప్రత్యేకంగా శ్రద్ధను తీసుకుని, ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించి, రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.