Ram Charan : బుచ్చిబాబుని ఫ్లైట్ లో తిప్పిన చరణ్.. త్వరలోనే RC16 షూట్ స్టార్ట్ చేద్దాం అంటూ స్పెషల్ ఫోటోలు..

తాజాగా బుధవారం నాడు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో చరణ్ బుచ్చిబాబుకు బొకే ఇచ్చి మరీ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే బుచ్చిబాబు ని తనతో పాటు తన పర్సనల్ ఫ్లైట్ లో.............

Ram Charan : బుచ్చిబాబుని ఫ్లైట్ లో తిప్పిన చరణ్.. త్వరలోనే RC16 షూట్ స్టార్ట్ చేద్దాం అంటూ స్పెషల్ ఫోటోలు..

Ram Charan wishes Director Buchhibabu birthday and gives special party in her own flight

Ram Charan :  రామ్ చరణ్ ప్రస్తుతం RC15 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన తర్వాత RC16 డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడు. సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసి డైరెక్టర్ గా మొదటి సినిమా ఉప్పెన తోనే భారీ విజయం సాధించి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు. ఈ సినిమా విజయం తర్వాత బుచ్చిబాబు వరుస సినిమాలు చేస్తదనుకున్నారు అంతా. కానీ స్టార్ హీరోల కోసం ట్రై చేస్తూ పలువురు హీరోలకు కథలు చెప్పాడు.

బుచ్చిబాబు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా ఇటీవల రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమా ఉండబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో టాలీవుడ్ తో పాటు అభిమానులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం RC16 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చరణ్ శంకర్ సినిమా షూట్ అయ్యాక ఈ సినిమా మొదలు అవుతుందని సమాచారం.

తాజాగా బుధవారం నాడు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో చరణ్ బుచ్చిబాబుకు బొకే ఇచ్చి మరీ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే బుచ్చిబాబు ని తనతో పాటు తన పర్సనల్ ఫ్లైట్ లో వైజాగ్ వరకూ తీసుకెళ్లి స్పెషల్ పార్టీ ఇచ్చాడు చరణ్. చరణ్ తో ఫ్లైట్ లో వెళ్లిన ఫోటోలను బుచ్చిబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఈ పుట్టిన రోజుని నేను మర్చిపోలేను. ఈ పుట్టినరోజుని చాలా మెమరబుల్ గా మార్చారు. త్వరలోనే మనం సెట్స్ లో కలవడానికి ఎదురుచూస్తున్నాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటాను. థ్యాంక్యూ సార్ అని ట్వీట్ చేశాడు.

Akhil : ఏజెంట్ అఖిల్ తో మాట్లాడాలనుకుంటున్నారా?? ఇదే ఛాన్స్.. మిస్ అవ్వకండి..

దీంతో చరణ్ అభిమానులు బుచ్చిబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ చరణ్ కి మంచి హిట్ సినిమా ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక చరణ్, బుచ్చిబాబు ఫ్లైట్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.