Virupaksha : విరూపాక్ష సక్సెస్‌ పై రామ్ చరణ్ రియాక్షన్.. ట్వీట్ వైరల్!

సాయి ధరమ్ విరూపాక్ష సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సక్సెస్ పై రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.

Ram Charan tweet on Sai Dharam Tej Virupaksha success

Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నిన్న (ఏప్రిల్ 21) రిలీజ్ అయ్యింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ షోస్ చూస్తుంది. ఇక సాయి ధరమ్ కమ్ బ్యాక్ ఇస్తూ చేసిన మూవీ కావడంతో మెగా ఫ్యామిలీ కూడా ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న చిరంజీవి తన ఇంటిలో సాయి ధరమ్ ని అభినందిస్తూ మూవీ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.

Virupaksha Collections: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. తేజు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడుగా!

తాజాగా ఈ మూవీ సక్సెస్ గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రియాక్ట్ అయ్యాడు. “కాంగ్రాట్యులేషన్స్ బ్రదర్ (సాయి ధరమ్). విరూపాక్ష గురించి మంచి టాక్ వినిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సాయి ధరమ్ రిప్లై ఇస్తాడు.. ‘థాంక్యూ సో మచ్ మై లవింగ్ బ్రదర్ చరణ్’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుంది. మొదటి రోజే ఏకంగా రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సాయి ధరమ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అలాగే US బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 200K డాలర్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తుంది.

Virupaksha: ‘విరూపాక్ష’ను రిలీజ్ చేయండి ప్లీజ్ అంటోన్న నార్త్ ఆడియెన్స్..?

పాన్ ఇండియా కంటెంట్ వచ్చిన ఈ సినిమాని ప్రస్తుతం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. ఇప్పుడు ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో త్వరలో ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవ్వడం పక్క అని తెలుస్తుంది. నార్త్ లో రిలీజ్ అయితే కార్తికేయ-2 సినిమాలో అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశం ఉంది అంటున్నారు సినిమా విశ్లేషకులు.