Site icon 10TV Telugu

Ram Charan : అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి.. రామ్ చరణ్, ఉపాసన..

Ram Charan Upasana will be attending Anant Ambani Radhika Merchant pre wedding festivities

Ram Charan Upasana will be attending Anant Ambani Radhika Merchant pre wedding festivities

Ram Charan : రామ్ చరణ్, ఉపాసన దంపతులు అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి వెళ్ళబోతున్నారట. అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జమ్‌నగర్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 28న ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ఈవెంట్ కి వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ వంటి ఇంటర్నేషనల్ పర్సన్స్ అతిథులుగా రావడంతో.. ఈ ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది.

ఈ గ్రేట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఇండియాలోని టాప్ స్టార్స్ కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్స్ ఈ సెలబ్రేషన్స్ కి గెస్ట్‌లుగా హాజరవుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో సహా కలిసి ఇప్పటికే జమ్‌నగర్ చేరుకున్నారు. ఇక స్టార్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ జంటకి కూడా ఆహ్వానం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also read : హాలీవుడ్‌లో రామ్‌చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన..

రామ్ చరణ్ అండ్ ఉపాసనకి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్విటేషన్ అందిందని, వారు ఇద్దరు కూడా ఆ సెలబ్రేషన్స్ కి వెళ్ళబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. కొంచెం వేచి చూడాల్సిందే. కాగా సంగీత్ ఫంక్షన్ తో మొదలవుతున్న ఈ సెలబ్రేషన్స్ లో రిహన్న మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కాన్సర్ట్ కావాల్సిన భారీ ఎక్విప్మెంట్స్ ఫ్లైట్ లో ఇండియాకి చేరుకున్నాయి.

ఇక ఈ మ్యూజికల్ కాన్సర్ట్ పూర్తి అయిన తరువాత రోజు అతిథులతో జంగల్ సఫారీ ఈవెంట్ ఉండబోతుంది. ఆ నెక్స్ట్ డే జమ్‌నగర్ ప్రకృతి అందాలను అతిథులకు చూపించనున్నారు. మరి ఈ ఈవెంట్ ఇంకెంతమంది సినిమా స్టార్స్ అటెండ్ అవుతున్నారో చూడాలి.

Exit mobile version