హాలీవుడ్‌లో రామ్‌చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన..

హాలీవుడ్ మేకర్స్, మీడియా అండ్ క్రిటిక్స్ పొగడ్తలతో ఆగిపోలేదు రామ్ చరణ్ క్రేజ్.. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చేవరకు చేరింది.

హాలీవుడ్‌లో రామ్‌చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన..

Hollywood Casting Site gave Ram Charan as Example for what they are looking for

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా చరణ్ చేసిన యాక్టింగ్ హాలీవుడ్ ఆడియన్స్‌ని, మేకర్స్‌ని ఫిదా చేసింది. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలకు రామ్ చరణ్ పర్ఫెక్ట్ ఛాయస్ అంటూ హాలీవుడ్ మీడియా అండ్ క్రిటిక్స్ రాసుకోచ్చేలా చరణ్ తన నటనా ప్రదర్శన చేశారు.

అయితే చరణ్ యాక్టింగ్ ఇంపాక్ట్ అక్కడితో ఆగిపోలేదు. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చేవరకు చేరింది. హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ఒక పాత్ర కోసం నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక ఆ పాత్ర ఎలాంటిది అని తెలియజేయడం కోసం ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొన్ని పాత్రలను ఉదాహరణగా చూపించింది.

Also read : Rashmika Mandanna : జపాన్‌లో రష్మిక ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. పోస్టర్స్‌తో ఫ్యాన్స్ సందడి..

అలా ఒక ఆరు పాత్రలని ఆ ప్రకటనలో ఇచ్చారు. ఆ పాత్రల్లో ఒకటి.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ కాప్ రోల్. వాటిలో ఉన్న మిగిలిన ఐదు పాత్రలు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ గా నిలిచినవే. అలాంటి రోల్స్ మధ్య రామ్ చరణ్ స్థానం దక్కించుకోవడం అంటే గొప్ప విషయమే. ప్రస్తుతం ఈ ప్రకటనకి సంబంధించిన ఫొటోగ్రాఫ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన చరణ్ అభిమానులు.. సోషల్ మీడియాలో గ్లోబల్ స్టార్ అంటూ తెగ సందడి చేస్తున్నారు.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందుతుంది. ఈ స్టోరీ కూడా గ్లోబల్ కంటెంటే అంటున్నారు ఈ మూవీ రైటర్ బుర్ర సాయి మాధవ్. రామ్ చరణ్ పాత్రలో వేరియేషన్స్ ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువుగా ఈ సినిమాలోని కనిపిస్తాయని చెబుతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.