Ram Charan : పాన్ ఇండియా నిర్మాతలతో ప్రాజెక్ట్ చేయబోతున్న చరణ్.. గ్లోబల్ ఆడియన్స్‌ టార్గెట్!

రామ్ చరణ్ ఇటీవల తన స్నేహితుడుతో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా నిర్మాతలతో కలిసి గ్లోబల్ ఆడియన్స్‌ టార్గెట్ గా ఒక ప్రాజెక్ట్..

Ram Charan : పాన్ ఇండియా నిర్మాతలతో ప్రాజెక్ట్ చేయబోతున్న చరణ్.. గ్లోబల్ ఆడియన్స్‌ టార్గెట్!

Ram Charan V Mega Pictures collaborate with Abhishek Agarwal Arts for new project

Updated On : May 27, 2023 / 3:59 PM IST

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల మరో కొత్త నిర్మాణ సంస్థని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పై పలు సినిమాలు నిర్మిస్తూ వస్తున్న చరణ్.. ప్రభాస్ (Prabhas) సొంత నిర్మాణ సంస్థUV క్రియేషన్స్ లో పార్ట్నర్, తన చిన్ననాటి స్నేహితుడు అయిన విక్రమ్ తో కలిసి ‘వి మెగా పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని అనౌన్స్ చేశాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ కొత్త డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ తో సినిమాలు తెరకెక్కిస్తామని, చిన్న సినిమాలు కూడా ఈ సంస్థలో నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.

Salman Khan : ఇక తన లైఫ్‌లో పెళ్లి చాప్టర్ లేదని చెప్పేసిన సల్మాన్.. వీడియో వైరల్!

తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. కాశ్మీర్ ఫైల్స్ అండ్ కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న అభిషేక్ అగర్వాల్ నిర్మాణ సంస్థతో కలిసి వి మెగా పిక్చర్స్ ఒక ప్రాజెక్ట్ నిర్మించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇండియన్ కంటెంట్ ని గ్లోబల్ ఆడియన్స్ కి గ్రాండ్ గా పరిచయం చేసేలా ఈ రెండు నిర్మాణ సంస్థలు రాబోతున్నాయి అంటూ ఒక వీడియో ద్వారా ప్రకటించారు. రేపు (మే 28) ఉదయం 11:11 గంటలకు ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతుంది అంటూ తెలియజేశారు.

Ram Charan : హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్‌ని.. ఇండియా రావాలని కండిషన్ పెడతా.. రామ్‌చరణ్!

దీంతో ఈ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది. ఆ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ నటిస్తాడా? లేదా మరో హీరో నటించబోతున్నాడా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వీటన్నిటి పై ఒక క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో చరణ్ తండ్రి కొడుకులుగా రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు.