NTR – Ram Charan : కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పుట్టినరోజు నేడు (జూన్ 4) కావడంతో సెలబ్రేటిస్ అంతా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కేజీఎఫ్ (KGF) చిత్రాలతో ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో సలార్ (Salaar) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ సెట్స్ లో ప్రశాంత్ పుట్టినరోజుని కేక్ కట్ చేసి ప్రభాస్ సెలబ్రేట్ చేయగా.. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Ram Charan : స్నేహితుడు పెళ్లి చేసి రిటర్న్ అయ్యిన రామ్‌చరణ్.. పెళ్ళిలోని చరణ్ ఫొటోలతో మీమ్స్..
తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. “హ్యాపీ బర్త్ డే బ్రదర్ ప్రశాంత్ నీల్. ఈ బర్త్ డే అండ్ ఈ ఇయర్ నీకు చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా నాటు కోడి పులుసు పంపించి బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
Ram Charan wishes and NTR food treat for Prashanth Neel on his birthday celebrations
కాగా ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉన్న సంగతి తెలిసిందే. NTR31 గా వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన దేవర (Devara), ప్రశాంత్ సలార్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన ఎన్టీఆర్.. తాజాగా అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. త్వరలోనే మళ్ళీ దేవర షూటింగ్ కూడా మొదలు కానుంది.
Wishing my brother #PrashanthNeel a great birthday and a great year ahead!!
— Ram Charan (@AlwaysRamCharan) June 4, 2023