Ram Charans Wife Upasana comments on financial independence
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ వుమెన్‌గా ఉపాసన అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన బిజినెస్‌ల గురించి, ఫ్యామిలీ గురించి పోస్ట్‌లు చేస్తుంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి మనవరాలు అయిన ఉపాసన సుమారు రూ.77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగా పేరొందిన సంగతి తెలిసిందే. అయితే సంపద విషయంలో తన జీవితాన్ని పూర్తిగా స్వయం ఆధారంగా తీర్చిదిద్దుకోవాలని ఉపాసన నిర్ణయించుకున్నారట.
ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. ‘నేను ధనవంతుల కుటుంబంలో పుట్టానని అందరు భావిస్తారు. కానీ.. నా వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి కావలసిన సంపద నాకిది కాదు. అందుకే నేను ఆర్థిక విషయాల్లో స్వయం నియంత్రణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంపద విషయంలో వేరే వారిని నమ్మడం, వారిపైన ఆధారపడడం నాకు ఇష్టం లేదు. ‘అని అంది.
సంపద విషయంలో కుటుంబ సభ్యులపై పూర్తిగా ఆధారపడకుండా, తాను స్వయంగా సంపదను నిర్మించుకోవాలని ఉపాసన అనుకుంటుంది. వ్యాపారం ఎలా నడపాలో, సంపద ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలని తాను అధ్యయనం మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు.
‘ఆర్థిక పరిజ్ఞానం ప్రతి మహిళకు అవసరం. వారసత్వంగా సంపద వచ్చినా.. దాన్ని ఎలా నిర్వహించాలో తెలిసుండాలి. లేదంటే ఆ సంపదను సరిగ్గా ఉపయోగించలేరు.’ అని ఉపాసన అభిప్రాయపడింది.
ఇక వివాహం పూలపాన్పు కాదన్నారు. ఇద్దరి మధ్య సరైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే బంధం నిలబడుతుందని, తనకూ చరణ్‌కు మధ్య అది చక్కగా పని చేస్తున్నట్లు చెప్పారు.