MAA Elections: లోకల్.. నాన్ లోకల్.. రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లోకలా?
ఎక్కడ కాంట్రవర్శీకి అవకాశం ఉంటే అక్కడ వాలిపోతాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం "మా" ఎన్నికలవేళ లోకల్.. నాన్ లోకల్ అనే పదాల వాడకం ఎక్కువ అవగా.. ఇదే అంశంపై ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా ట్వీట్లు సంధించాడు రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma Comments Ntr Anr In Support Of Prakash Raj In Maa Elections
Ram Gopal Varma Comments on NTR, ANR: ఎక్కడ కాంట్రవర్శీకి అవకాశం ఉంటే అక్కడ వాలిపోతాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం “మా” ఎన్నికలవేళ లోకల్.. నాన్ లోకల్ అనే పదాల వాడకం ఎక్కువ అవగా.. ఇదే అంశంపై ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా ట్వీట్లు సంధించాడు రామ్ గోపాల్ వర్మ.
ఈ సంధర్భంగా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు.. బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ గారు, తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా? ఎలా ఎలా ఎలా? అంటూ ఒక ట్వీట్ వేశారు. అందుకు కొనసాగింపుగా వరుస ట్వీట్లలో ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేశారు.
కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా ? #MaaElections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
కర్ణాటక నుంచి ఏపీకి వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా?” ముప్పై ఏళ్లుగా ప్రకాష్ రాజ్.. ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే స్వయంగా ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ.. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పించాడు.. ప్రకాష్ రాజ్ నాన్ లోకలా..???
కర్ణాటక నించి AP కి వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ? ఎలా ? ఎలా ? #MaaElections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
ముప్పై ఏళ్లుగా @prakashraj ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ localaa??? #MaaElections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
ప్రకాష్ రాజ్ నటన చూసి, నాలుగు సార్లు ఈ దేశం శాలువా కప్పి నేషనల్ అవార్డుతో సత్కరిస్తే, అతను నాన్ లోకలా? ఈ కామెంట్ దేశానికే వ్యతిరేకం కాదా? మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకలే.. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్.. బ్రూస్‌లీ నాన్ లోకల్.. రాముడు సీత కూడా నాన్ లోకలే.. ప్రకాష్ రాజ్ కూడా నాన్ లోకలే కదా?
అతని నటన చూసి @prakashraaj నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి national award తో సత్కరిస్తే , calling him non local …it’s a comment against india #MAAelections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ non లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. bruce lee non local..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. @prakashraaj also Non Local #MAAelections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021