Ram Gopal Varma complaint to police djp on Kolikapudi Srinivasa Rao
Ram Gopal Varma : టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ చుట్టూ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా ఈ సినిమా తెరకెక్కించారని, ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పై నిరసనలు, డెబిట్ లు జరుగుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లో అమరావతి ఉద్యమం నేత కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మ తల తీసుకువస్తే కోటి రూపాయల నజరానా ఇస్తానంటూ కొలికపూడి శ్రీనివాసరావు పదేపదే మాట్లాడారు. ఇక ఈ విషయంపై ఆర్జీవీ రెస్పాండ్ అవుతూ నేడు మంగళగిరి డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోలికపూడి శ్రీనివాసరావు పై డీజీపీకి ఫిర్యాదు చేశారు.
కాగా, ఈ సోమవారం డిసెంబర్ 25న వ్యూహం సినిమాపై నిరసన తెలియజేస్తూ.. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఆఫీస్ వద్ద కొంతమంది వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆ ఈ విషయంపై కూడా ఆర్జీవీ టీం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆర్జీవీ దగ్గర పని చేస్తున్న కారు డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. డిసెంబర్ 25 రాత్రి దాదాపు 12-15 మంది వ్యక్తులు గుంపుగా వచ్చి రాంగోపాల్ వర్మ ఆఫీస్ వద్ద దిష్టిబొమ్మని దహనం చేశారని కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
Also read : సలార్ సినిమాకు A సర్టిఫికెట్ ఎఫెక్ట్.. ప్రభాస్ బుల్లి ఫ్యాన్స్ సలార్‌కి దూరమవుతున్నారా..?
ఆ వచ్చినవారంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ అనుచరులని.. ఆ మొత్తం దాడి సీసీటీవీ, సెల్ ఫోన్స్ చిత్రీకరణ అయ్యిందని, వాటిని కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు. మరి ఇన్ని వివాదాల మధ్య ఈ సినిమాని రిలీజ్ చేస్తే థియేటర్స్ వద్ద ఎలాంటి గొడవలు జరుగుతాయో అని థియేటర్ ఓనర్స్ కూడా భయపడుతున్నారు. మరి ఈ చిత్ర రిలీజ్ ఎలా సాగుతుందో చూడాలి.