Salaar : సలార్ సినిమాకు A సర్టిఫికెట్ ఎఫెక్ట్.. ప్రభాస్ బుల్లి ఫ్యాన్స్ సలార్‌కి దూరమవుతున్నారా..?
సలార్ సినిమాకు A సర్టిఫికెట్ రావడంతో బుల్లి ఫ్యాన్స్ సలార్‌కి దూరమవుతున్నారు. దీని వల్ల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడుతుంది.

Salaar A certificate is disappointing Prabhas child fans it effects on movie collections
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందించిన చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఖాన్సార్ అనే ఓ అండర్ వరల్డ్ క్రైమ్ సిటీ సింహాసనం కోసం జరిగే యుద్ధం నేపథ్యంతో తెరకెక్కింది. దీంతో ఈ సినిమా మాస్ వైలెంట్ యాక్షన్ సీన్స్ తో రూపొందింది. ఇక దీనివల్ల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు సలార్ కలెక్షన్స్ కి ఇబ్బంది కలిగిస్తుంది.
బాహుబలి సినిమాతో ప్రభాస్ కి పిల్లల్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. బాహుబలి తరువాత నుంచి ప్రభాస్ ప్రతి సినిమాని థియేటర్ లో చూసేందుకు.. పిల్లలు తమ పేరెంట్స్ ని వెంటబెట్టుకొని వచ్చేస్తుంటారు. అయితే సలార్ సినిమాకి అలా థియేటర్ కి వస్తుంటే.. అక్కడ థియేటర్ మేనేజ్మెంట్ ఆపేస్తున్నారు. ఈ సినిమాకి A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల పిల్లల్ని సినిమా చూడడానికి అనుమతించడం లేదు.
Also read : Salaar : తన పిల్లలని ‘సలార్’ చూడనివ్వడం లేదని.. థియేటర్ యాజమాన్యంతో గొడవపెట్టుకున్న తల్లి..
దీంతో పిల్లలందరూ తమ బాహుబలిని చూడలేక నిరాశతో ఇంటికి వెనుదిరుగుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రావాల్సిన కలెక్షన్స్ కి దెబ్బ పడుతుంది. ఈ చిత్రం ఇప్పటికే 500 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ A సర్టిఫికెట్ వల్ల కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ కి అమ్మాయిల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సర్టిఫికెట్ వల్ల వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తో రాలేక ఈ మూవీకి కొంచెం దూరం అవుతున్నారు.
ఇటీవల రిలీజైన్ యానిమల్ మూవీ కూడా ఇదే సమస్యని ఎదుర్కొంది. యానిమల్ మూవీ నిర్మాతలు కూడా ఈ విషయం గురించే మాట్లాడుతూ.. A సర్టిఫికెట్ వల్ల తమ కలెక్షన్స్ కి కొంచెం ఇబ్బంది ఎదురైందని చెప్పుకొచ్చారు. దానివల్లే 1000 కోట్ల మార్క్ అందుకోవడానికి కొంచెం కష్టమైందని వెల్లడించారు. మరి ఈ సమస్యని సలార్ మూవీ ఎదుర్కొని వెయ్య కోట్ల మార్క్ ని అందుకుంటుందేమో చూడాలి.
కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి.
ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ సినిమాలు పఠాన్, జవాన్, యానిమల్ భారీ కలెక్షన్స్ ని నమోదు చేశాయి. కానీ ఇప్పుడు సలార్ కలెక్షన్స్ రోజు చూస్తుంటే.. ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు అతి కష్టం మీద 1000 కోట్ల మార్క్ వరకు చేరుకొని ఈ ఏడాది ఇండియన్ టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి. కానీ సలార్ మూడు రోజుల్లోనే 400 కోట్ల మార్క్ ని అందుకొని బాలీవుడ్ హీరోలకు టెన్షన్ పెడుతుంది.