Salaar : తన పిల్లలని ‘సలార్’ చూడనివ్వడం లేదని.. థియేటర్ యాజమాన్యంతో గొడవపెట్టుకున్న తల్లి..

ఈరోజు కూడా క్రిస్మస్ హాలిడే ఉండడంతో థియేటర్ కి ఆడియన్స్ భారీగా తరలి వస్తున్నారు. ఈక్రమంలోనే ఒక తల్లి తన పిల్లలతో కలిసి సలార్ సినిమాకి రాగా..

Salaar : తన పిల్లలని ‘సలార్’ చూడనివ్వడం లేదని.. థియేటర్ యాజమాన్యంతో గొడవపెట్టుకున్న తల్లి..

hyderabad living mother argument with theater management for watch prabhas salaar

Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శ్రియారెడ్డి, శ్రుతిహాసన్, టిన్ను ఆనంద్.. ఇలా భారీ స్టార్ క్యాస్ట్ నటించింది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఈరోజు కూడా క్రిస్మస్ హాలిడే ఉండడంతో థియేటర్ కి ఆడియన్స్ భారీగా తరలి వస్తున్నారు.

ఈక్రమంలోనే ఒక తల్లి తన పిల్లలతో కలిసి హైదరాబాద్ ఉప్పల్ DSL మాల్‌లోని సినీ పోలీస్ థియేటర్ లో సలార్ సినిమా చూసేందుకు వచ్చింది. అయితే థియేటర్ యాజమాన్యం.. ఆ తల్లి పిల్లలని థియేటర్ బైట ఆపేసారు. కారణమేంటంటే.. ఈ సినిమాకి A సర్టిఫికేట్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. కాబట్టి ఈ సినిమాని చిన్న పిల్లలు చూడడానికి అనుమతి లేదు.

Also read : సలార్ మేకింగ్ వీడియో చూశారా..? అవి అన్ని గ్రాఫిక్స్ కాదా..!

అయితే ఈ సర్టిఫికెట్ విషయం గమనించని ఆ తల్లి ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకొని థియేటర్ కి వచ్చేసింది. ఇక అక్కడ థియేటర్ యాజమాన్యం అనుమతించకపోవడంతో.. వారితో ఆ తల్లి గొడవ పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సలార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.178 కోట్లకు పై గ్రాస్‌ని అందుకున్న ఈ చిత్రం రెండో రోజు దాదాపు 117 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఆదివారం 107 పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి.. మొత్తం మూడురోజుల్లో 402 కోట్ల గ్రాస్ ని సెట్ చేసింది. ఈరోజు కూడా క్రిస్మస్ హాలిడే ఉండడంతో.. ఈ చిత్రం ఈరోజు కూడా 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఖాయం అని తెలుస్తుంది.

కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పటివరకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ చూస్తుంటే.. ఆల్మోస్ట్ 200 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇంకో 150 కోట్లు షేర్ రాబడితే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.