Salaar : సలార్ మేకింగ్ వీడియో చూశారా..? అవి అన్ని గ్రాఫిక్స్ కాదా..!
సలార్ మేకింగ్ వీడియో చూశారా..? మూవీలో కనిపించే ఖాన్సార్ కోటలో..

Prabhas Prashanth Neel Salaar Part 1 Cease Fire Making Video released
Salaar Making Video : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శ్రియారెడ్డి, శ్రుతిహాసన్, టిన్ను ఆనంద్.. ఇలా భారీ స్టార్ క్యాస్ట్ నటించింది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. కాగా మూవీ టీం ఈ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
ఈ మేకింగ్ వీడియోలో మూవీలోని హైలైట్ సీక్వెన్స్ చిత్రీకరణని చూపించారు. భారీ సెట్స్, భారీ క్రూ మెంబెర్స్ తో సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ మేకింగ్ వీడియోలో చూపించిన కొన్ని విజువల్స్ చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. మూవీలో కనిపించే ఖాన్సార్ కోటలో పెద్ద పెద్ద విగ్రహాలు కత్తులు పట్టుకొని నిలబడి కనిపిస్తాయి. ఇవి గ్రాఫిస్స్ లో చూపించారని అందుకున్నారు. కానీ ఇప్పుడు మేకింగ్ వీడియోలో అవి సెట్ ప్రోపర్టీగా కనిపించాయి. అలాగే హెలికాప్టర్స్, యుద్ధ వాహనాల్ని కూడా గ్రాఫిక్స్ కాకుండా ఒరిజినల్ గానే చూపించారు.
Also read : సలార్‌లో నటించిన శ్రియారెడ్డి.. ఆ ఇండియన్ క్రికెటర్ కుమార్తె అని మీకు తెలుసా..?
ఇక అవి గమనించిన ఆడియన్స్.. ప్రశాంత్ నీల్ మూవీ కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే భారీగా కనిపించే ఖాన్సార్ సిటీని కూడా చాలా వరకు నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక ప్రతి మేకింగ్ షాట్ లో టెక్నీషియన్స్, యాక్టర్స్ తో కలుపుకొని దాదాపు 100కు పైగా మెంబెర్స్ సెట్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
??? ????????? ?? ????? ???? ???? ???? ?????? #??????????????? ?
▶️ https://t.co/gSvaQQDzL0#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/MWVabxNk65
— Hombale Films (@hombalefilms) December 25, 2023
సలార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.178 కోట్లకు పై గ్రాస్‌ని అందుకున్న ఈ చిత్రం రెండో రోజు దాదాపు 117 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. అంటే రెండు రోజుల్లో ఈ చిత్రం 295 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక మూడో రోజు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి.. మూడు రోజుల్లో 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చెబుతున్నారు.