కమ్మరాజ్యంలో కడపరెడ్లు : బాబు లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : September 7, 2019 / 06:20 AM IST
కమ్మరాజ్యంలో కడపరెడ్లు : బాబు లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

Updated On : September 7, 2019 / 6:20 AM IST

వీకెండ్ లో పొద్దుపొద్దునే స్టార్ట్ చేశారు రాంగోపాల్ వర్మ. కొత్తగా తీస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీ విశేషాలను నెటిజన్లతో మంచుకున్నారు. మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్. టైటిల్ రిజైన్ అలవాటైన క్రైం తరహాలోనే డిజైన్ చేసి.. దానికి రక్తాన్ని చిందించాడు. ఏయ్ ఏసేయ్ రా నాకొడుకుని అనే డైలాగ్ తో టైటిల్ పడుతుంది.

కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లుక్ రిలీజ్ చేసిన 20 గంటల్లోనే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి.. మూవీ పబ్లిసిటీని స్పీడప్ చేశారు వర్మ. కాంట్రవర్సీ లేని సినిమాలో కాంట్రవర్సీ క్యారెక్టర్లు ఉన్నాయంటూ సందేశం ఇచ్చారు వర్మ.

అంతేకాదు చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆసక్తిగా ఉంది. బాబు సీరియస్ గా చూస్తున్నట్లు ఉంది. కళ్లద్దాలు చేతిలో పట్టుకుని ఏదో అంశంపై చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు లుక్ ఉంది. షూటింగ్ ఫుల్ స్పీడ్ గా నడుస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ తో సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌ర్మ ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.