సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో డిసెంబర్ 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు.
ఈ సంధర్భంగా ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ అయింది’ అని ప్రకటించిన వర్మ లేటెస్ట్‌గా సెన్సార్ సర్టిఫికేట్‌ను కేఏ పాల్ తనకు ఇస్తున్నట్లుగా ఓ ఫోటోను పెట్టారు. సినిమాలో ఉన్న పాత్రలు మరియు పాటలు తనను కించపరిచినట్లుగా ఉన్నాయంటూ కోర్టు మెట్లెక్కిన కేఏ పాల్ సినిమాను బ్యాన్ చెయ్యాలని కోరారు.
ఈ క్రమంలోనే సెన్సార్ కష్టాలు రాగా.. సినిమాను రివైజ్ కమిటీకి పంపిన వర్మ సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చున్నారు. ఈ సెన్సార్ సర్టిఫికేట్‌ను తనకు కేఏ పాల్ ఇస్తున్నట్లుగా ఓ ఫోటో పెట్టారు వర్మ. రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటో మార్ఫింగ్ అని తెలుస్తుంది. ఫోటోలో వర్మ మార్క్ మార్ఫింగ్ కనిపిస్తుంది.
??? pic.twitter.com/rsLYh1PrNP
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2019