kidambi srikanth – Shravya Varma : ఆర్జీవీ మేన‌కోడ‌లిని పెళ్లి చేసుకున్న బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీకాంత్..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

Ram Gopal Varma Niece Shravya Varma and Badminton player Srikanth wedding complete

kidambi srikanth – Shravya Varma : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. హైద‌రాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య ఈ జంట ఒక్క‌టి అయ్యారు.

ద‌ర్శ‌కులు నాగ్ అశ్విన్‌, వంశీ పైడిప‌ల్లి, హీరోయిన్ ర‌ష్మిక, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ కీర్తి సురేశ్‌ల‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు హాజ‌రు అయ్యారు. కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు నూత‌న వ‌ధూవ‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

శ్రావ్య వర్మ టాలీవుడ్‌లో స్టార్ ఫ్యాష‌న్ డిజైన‌ర్. నాగార్జున, విజయ్‌ దేవరకొండ, వైష్ణవ్‌ తేజ్‌, విక్రమ్‌, ధ్రువ్ వంటి స్టార్స్‌కు ఆమె స్టైలిస్ట్‌గా పని చేశారు. చిలసౌ, మ్యాస్ట్రో చిత్రాలకు శ్రావ్య కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ప‌ని చేసింది. ప్ర‌స్తుతం రష్మిక కథానాయికగా నటిస్తోన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీకి పని చేస్తోంది. కీర్తిసురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ‘గుడ్‌ లఖ్‌ సఖి’ చిత్రానికి సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించింది.

Delhi Ganesh : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు ఢిల్లీ గ‌ణేశ్ క‌న్నుమూత‌..

కాగా.. మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్‌, శ్రావ్య లు కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్ద‌ల స‌మ్మ‌తితో ఆగ‌స్టులో నిశిత్చార్థం చేసుకోగా తాజాగా పెళ్లి చేసుకున్నారు.

Shraddha Das : సూర్య ‘కంగువా’ సినిమాలో హీరోయిన్ శ్రద్దా దాస్ ఈ పాట పాడిందని తెలుసా..?