Ram Gopal Varma: వెంటాడుతున్న ‘దురంధర్’ కుక్క.. వణుకు పుట్టించింది.. రామ్ గోపాల్ వర్మ సంచనల పోస్ట్..
బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై సంచలన విజయం సాధించిన 'దురంధర్' సినిమాపై షాకింగ్ పోస్ట్ పెట్టాడు సంచలన దర్శకుడు (Ram Gopal Varma)రామ్ గోపాల్ వర్మ.
Ram Gopal Varma sensational post on Dhurandhar movie
Ram Gopal Varma: బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ‘దురంధర్’. URI మూవీ ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచనాలు క్రియేట్ చేస్తోంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది ఈ మూవీ. విడుదలైన 20 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.940 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Thanuja Puttaswamy: బిగ్ బాస్ బ్యూటీ తనూజ పుట్టస్వామి లేటెస్ట్ ఫొటోస్.. ఎంత క్యూట్ ఉందో చూడండి..
అయితే, తాజాగా దురంధర్ సినిమా సాధించిన విజయంపై షాకింగ్ పోస్ట్ పెట్టాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). దురంధర్ సినిమాను కుక్కతో పోల్చుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. “ధురంధర్ లాంటి హిస్టరీ క్రియేట్ చేసే సినిమాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ వారు దాన్ని పట్టించుకోనట్టుగా నటిస్తారు. కారణం ఏంటంటే, ఆ సినిమా స్థాయిని అందుకోలేమని భయం వాళ్లకి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ కుక్క ఉంది అనుకోండి. ఆ యాజామాని ఆ కుక్క కరవదు అని చెప్పినా కూడా మనలో ఆ భయం ఉంటూనే ఉంటుంది. దానిని అలా కళ్ళ చివర నుంచి భయంభయంగా చూస్తాం.
అదేవిదంగా ఇప్పుడు ప్రతి పెద్ద సినిమాలో ఆఫీసులో ‘ధురంధర్’ అనే సినిమా భయపెట్టే కుక్కలా తిరుగుతోంది. ఆ పేరు ఎత్తడానికి కూడా మేకర్స్ భయపడుతున్నారు. భారీ సెట్లు, విఎఫ్ఎక్స్, హీరో ఎలివేషన్ నే నమ్ముకుని సినిమాలు చేసే మేకర్స్ కి ‘ధురంధర్’ ఒక హారర్ సినిమా లాంటిది. దర్శకుడు ఆదిత్య ధర్ చేసిన ఈ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, గత 50 ఏళ్లలో ఎక్కువమంచి మాట్లాడుకున్న సినిమాగా నిలిచిందని”రాసుకొచ్చాడు వర్మ. దీంతో వర్మ చేసిన ఈ సంచనల పోస్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
