Ram Pothineni 'Andhra King Taluka' movie release date changed
Andhra King Taluka: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “ఆంధ్రా కింగ్ తాలూకా”. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. “ఏ ఫ్యాన్ బయోపిక్” అనే ట్యాగ్ తో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ (Andhra King Taluka)సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. అంతేకాదు. రామ్ పోతినేనికి చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఇస్మార్ శంకర్ తరువాత ఆయన చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు.
Rajini-Kamal: హీరోకి కథ నచ్చలేదు.. వారం రోజులకే సద్దేశారు.. కమల్ షాకింగ్ కామెంట్స్
అందుకే, ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు రామ్. ఎంతలా అంటే, ఈ సినిమా విడుదల వరకు మరో సినిమాను కూడా ఒప్పుకోలేదు. అంతలా ఈ సినిమా కోసం డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడు రామ్. కంటెంట్ కూడా చాలా కొత్త ఉండటంతో ఖచ్చితంగా రిజల్ట్ పాజిటీవ్ గా వస్తుంది అని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్ 28న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తోంది. మేకర్స్ ప్రకటించిన తేదీ కంటే ఒకరోజు ముందే అంటే నవంబర్ 27న విడుదల చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇక ఈ న్యూస్ తెలిసి రామ్ పోతినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మంచి అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రామ్ కి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలి.
THANKS @filmymahesh for GIVING the content one day in advance! #AndhraKingTaluka is coming to you on #Thanksgiving #AKTonNOV27 #AndhraKingTaluka pic.twitter.com/55WgsZTvhN
— RAm POthineni (@ramsayz) November 16, 2025