Ram Pothineni : రాజమండ్రిలో ‘రామ్’ షూటింగ్.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది.

Ram Pothineni

Ram Pothineni : హీరో రామ్ పోతినేని ఆంద్ర కింగ్ తాలుకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామ్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక హీరో పాత్రలో నటిస్తుండగా, రామ్ ఆ హీరో అభిమాని పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది.

అయితే రామ్ అక్కడ రాజమండ్రిలో ఒక స్టార్ హోటల్ లో బస చేస్తున్నారు. ఆ హోటల్ ఆరో ఫ్లోర్ లో ఒక విఐపీ రూమ్ లో ఉంటున్నాడట. నిన్న రాత్రివేళ ఓ ఇద్దరు వ్యక్తులు తాము హీరో స్టాఫ్ అని చెప్పి రామ్ ఉన్న ఫ్లోర్ కి లిఫ్ట్ యాక్సిస్ కావాలని హోటల్ స్టాఫ్ దగ్గర యాక్సిస్ కార్డు తీసుకొని రామ్ రూమ్ దగ్గరికి వెళ్లారట. రామ్ రూమ్ మాస్టర్ కీ తీసుకొని లోపలి వెళ్తే అక్కడ రామ్ ఇంకో రూమ్ లో డోర్ పెట్టుకొని పడుకున్నాడట.

Also Read : HariHara VeeraMallu : ట్రైలర్ లో అదిరిపోయిన డైలాగ్స్ ఇవే.. పవన్ పొలిటికల్ కి కూడా సరిపోయేలా.. మోదీ డైలాగ్ కూడా పెట్టారుగా..

దీంతో ఆ ఇద్దరూ రామ్ డోర్ ని దబదబా గట్టిగా కొట్టడంతో రామ్ కు అనుమానమొచ్చి హోటల్ వాళ్లకు, మూవీ యూనిట్ కి కాల్ చేసాడని సమాచారం. దీంతో హోటల్ స్టాఫ్ వచ్చి ఆ ఇద్దరి వ్యక్తుల్ని పట్టుకోగా, వారు బాగా తాగి ఉన్నట్టు తెలిసింది. ఆ ఇద్దర్ని పోలీసులకు అప్పచెప్పారు హోటల్ సిబ్బంది. అయితే వాళ్ళు ఎవరు? వాళ్లకు హోటల్ యాక్సెస్ కార్డ్స్ ఎవరిచ్చారు? రామ్ ఉన్నాడని తెలిసే అక్కడికి వెళ్ళారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.