HariHara VeeraMallu : ట్రైలర్ లో అదిరిపోయిన డైలాగ్స్ ఇవే.. పవన్ పొలిటికల్ కి కూడా సరిపోయేలా.. మోదీ డైలాగ్ కూడా పెట్టారుగా..
హరిహర వీరమల్లు డైలాగ్స్ :

Pawan Kalyan HariHara VeeraMallu Trailer Dialogues
HariHara VeeraMallu : నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజయిన సంగతి తెలిసిందే. ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఫ్యాన్స్ ట్రైలర్ చూసిన తర్వాత ఓ రేంజ్ లో యాక్షన్ తో అదరగొట్టడం, పంచ్ డైలాగ్స్ ఉండటంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక సినిమా జులై 24 రిలీజ్ కానుంది. అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ లోని కొన్ని డైలాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ డైలాగ్స్ పవన్ పొలిటికల్ కెరీర్ కి సరిపోయేలా ఉన్నాయంటూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
హరిహర వీరమల్లు డైలాగ్స్ :
‘హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం.. ‘ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పవన్ రియల్ లైఫ్ లో హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ డైలాగ్ పవన్ కి పర్ఫెక్ట్ సెట్ అయింది అంటున్నారు.
ఔరంగజేబు పాత్ర.. ‘ఇది నేను రాసే చరిత్ర.. సింహాసనమా మరణ శాసనమా’ అనే డైలాగ్ తో అప్పట్లో మొఘలులు ఎంత విధ్వంసం సృష్టించారో చెప్పారు.
‘ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్.. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి..’ అంటూ పవన్ కోహినూర్ డైమండ్ ఎత్తుకొస్తాడని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్.. ‘ఇప్పటిదాకా మేకల్ని తినే పులుల్ని చూసి ఉంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు..’ అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.
నిధి అగర్వాల్ పంచమి పాత్ర.. ‘సర్దుకోలేకపోతున్నా సాయం చేస్తావా..’ అనే డైలాగ్ తో ఆమె హరిహర వీరమల్లుని సాయం అడుగుతుంది తెలుస్తుంది. ఇక సునీల్.. ‘దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట’ అనే డైలాగ్ తో హరిహర వీరమల్లు రాజుల దగ్గర్నుంచి పంచమిని తప్పిస్తాడని తెలుస్తుంది.
పవన్.. ‘నేను రావాలని చాలా మంది దండం పెట్టుకుంటూ ఉంటారు. కానీ నేను రాకూడదు అని మీరు చూస్తున్నారు..’ అని తన రాజకీయ కెరీర్ కి సరిపోయే డైలాగ్ ని చెప్పారు. అలాగే.. వినాలి.. వీరమల్లు చెప్పింది వినాలి అంటూ ఆయన చెప్పే మాట వినాలి అని హింట్ ఇచ్చారు.
ఔరంగజేబు పాత్ర.. ‘హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి’ అని యుద్దానికి సిద్ధమయ్యే డైలాగ్ చెప్పారు.
ఇక పవన్ ని ఉద్దేశించి మోదీ ఆందీ(తుఫాను) అని నేషనల్ మీడియా ముందు అన్న డైలాగ్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ చివర్లో ఔరంగజేబు.. హరిహర వీరమల్లుని ఉద్దేశించి ‘ఆందీ వచ్చేసింది..’ అని చెప్పడంతో ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చారు.
మీరు కూడా ట్రైలర్ చూసేయండి..