Hari Hara Veera Mallu : పవన్ ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిన యాక్షన్ సీన్స్.. గూస్ బంప్స్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు మూవీ ట్రైలర్ వచ్చేసింది.

Pawan kalyan Hari Hara Veera Mallu trailer out now
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడుపోసుకుంటున్న సమయం.. అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. “ఇప్పటి దాకా మేకలు తినే పులిని చూసి ఉంటారు. ఇప్పుడు పులులను వేటాడే బెబ్బుల్ని చూస్తారు.” అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. మొత్తంగా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
Thug Life : 8 వారాలు అన్నారు.. నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఫ్లాప్ మూవీ..
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెరకెక్కించారు. అయితే.. కొన్నికారణాల వల్ల ఆయన తప్పుకోగా నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.