Ram Pothineni: బోయపాటి సినిమాలో రామ్ అలా కనిపిస్తాడా..?
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ram Pothineni: బోయపాటి కోసం ఫ్యామిలీతో బిజీగా ఉన్న రామ్..!
కాగా, ఈ సినిమాను బోయపాటి తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ లుక్స్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ రఫ్ అండ్ రగడ్ లుక్‌లోనే కాకుండా, ప్రేక్షకులు ఊహించని విధంగా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలోని ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రామ్ 50 ఏళ్ల వ్యక్తి గెటప్‌లో కనిపించనున్నాడట.
Ram Pothineni: బాలీవుడ్ పాపతో రామ్ చిందులు.. బోయపాటి టార్గెట్ అదేనా?
ఈ వార్తతో అభిమానులు ఈ సినిమాలో రామ్ 50 ఏళ్ల వ్యక్తి పాత్రలో ఎలా ఉండబోతున్నాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి నిజంగానే ఈ సినిమాలో రామ్ 50 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటిస్తాడా.. ఆ గెటప్‌లో రామ్ ఎలా కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.