Rama Charan went to Vacation with his Rhyme Photo goes Viral
Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే వైజాగ్ లో షూట్ కంప్లీట్ చేసొచ్చిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రాబోయే రామ్ చరణ్ నెక్స్ట్ రెండు సినిమాలు RC 16, RC 17 కూడా గత కొన్ని రోజులు బాగా వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ ఇటీవలే తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానులు చరణ్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
తాజాగా చరణ్ వెకేషన్ కి వెళ్తున్నారని సమాచారం. తన పెంపుడు కుక్కపిల్ల రైమ్ తో కలిసి రామ్ చరణ్ వెకేషన్ కి వెళ్తున్నారని సమాచారం. ఫ్లైట్ లో చరణ్, రైమ్ కూర్చొని దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వెకేషన్ కి ఎక్కడికి వెళ్తున్నారో ఇంకా తెలియలేదు. చరణ్ ఒక్కరే వెళ్తున్నారా ? ఉపాసన కూడా వెళ్తున్నారా క్లారిటీ రావాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమా ప్రస్తుతం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారని, నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుందని, ఈ గ్యాప్ లో చరణ్ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. మరి వెకేషన్ నుంచి కొత్త కొత్త స్టిల్స్, ఎక్కడికి వెళ్ళింది చరణ్ షేర్ చేస్తాడేమో చూడాలి.
Vacay mode on! ✈️?
?????? ???? @AlwaysRamCharan & his ??? friend #Rhyme strike a pose as they gear up for a vacation ?#RamCharan #GlobalStarRamCharan #GameChanger #RC16 #RC17 pic.twitter.com/5xsL4hfZlH
— ??????????? (@UrsVamsiShekar) March 30, 2024