Tillu Square Collections : వామ్మో ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయిగా.. స్టార్ హీరోల సినిమాలకు సమానంగా..

టిల్లు స్క్వేర్ మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Tillu Square Collections : వామ్మో ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయిగా.. స్టార్ హీరోల సినిమాలకు సమానంగా..

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie First Day Collections

Updated On : March 30, 2024 / 9:57 AM IST

Tillu Square Collections : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా నిన్న మార్చి 29న రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై టిల్లు స్క్వేర్ సినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి ఆట నుంచి టిల్లు స్క్వేర్ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

టిల్లు స్క్వేర్ సినిమాకు ముందు నుంచి భారీ అంచనాలు ఉండటంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఏకంగా 27 కోట్లకు టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. కలెక్షన్స్ కూడా ఊహించని విధంగా భారీగానే వస్తున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్ మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Also Read : Nithiin : ‘తమ్ముడు’ వచ్చేసాడు.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో నితిన్.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్..

టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో కూడా మొదటి రోజే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఇటీవల రావట్లేదు. సిద్ధూ టిల్లు స్క్వేర్ సినిమాతో అదరగొట్టేసాడు. ఈ వీకెండ్ నేడు, రేపట్లో ఈజీగా 50 కోట్లు దాటేస్తుందని, ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని తెలుస్తుంది. నిర్మాత నాగవంశీ నిన్న సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారు. టిల్లు స్క్వేర్ హంగామా చూస్తుంటే ఈజీగానే 100 కోట్లు కొట్టేలా ఉంది.