Chiranjeevi: మెగాస్టార్ కోసం మొదటిసారి.. రంగంలోకి మ్యాజికల్ సింగర్.. అనిల్ ప్లాన్ సూపర్ కదా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మన శంకర వరప్రసాద్ గారు". కామెడీ (Chiranjeevi)చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ కోసం మొదటిసారి.. రంగంలోకి మ్యాజికల్ సింగర్.. అనిల్ ప్లాన్ సూపర్ కదా..

Ramana Gogula sing a song for the first time in Chiranjeevi movie

Updated On : November 2, 2025 / 7:48 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు”. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కీ రోల్ చేస్తున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” (Chiranjeevi)లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరంజీవి-అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్ ను మ్యాచ్ చేసేందుకు టీం కూడా చాలా కష్టపడుతున్నారు.

Shah Rukh Khna: కాపీ “కింగ్” అంటున్నారు.. ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాల నుంచి..

2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో గోదారి గట్టు మీద అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా విజయంలో ఈ ఒక్క పాట కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ అందించడానికి ప్లాన్ చేస్తున్నాడు భీమ్స్. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల పాట ఒక ఊపు ఊపుతోంది. త్వరలో విడుదల కాబోతున్న రెండో పాట అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చాలా కాలం తరువాత తన మ్యాజికల్ వాయిస్ తో కుమ్మేసిన రమణ గోగులను రంగంలోకి దించబోతున్నాడట భీమ్స్. చిరు-నయనతార మధ్య డ్యూయెట్ లా రానున్న ఈ పాట ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించబోతుందట. ఇక రమణ గోగుల కూడా చిరంజీవికి పాడటం మొదటిసారి. అందుకే, ఈ పాట చాలా ప్రత్యేకంగా మారింది. త్వరలోనే ఈ పాటను విడుదల చేయబోతున్నారట మేకర్స్. మరి ఈ పాట గోదారి గట్టు మీద పాట క్రియేట్ చేసినంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా చూడాలి.