Ramarao On Duty Director Trolled For Movie Failure
Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చాడు. ఇక ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ అత్యద్భుంగా ఉంటుందని చిత్ర యూనిట్ ముందు నుండీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది.
Ramarao On Duty: రామారావుకు తప్పని లీకుల బెడద!
అయితే రిలీజ్ రోజున ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడం, సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో ఈ సినిమా తొలిరోజే ఫ్లాప్ అనే ముద్రను వేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందర ఈ సినిమా తోపు అంటూ శరత్ మండవ చేసిన కామెంట్స్‌కు ఇప్పుడు అతడిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందర రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై ఒక రేంజ్‌లో కామెంట్స్ చేసి, ఇప్పుడు సినిమాలో పసలేని కంటెంట్‌ను ప్రేక్షకులపై రుద్దడం ఏమిటని నెటిజన్లు, రవితేజ అభిమానులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు.
Ramarao On Duty: రామారావు తొలి రోజు వసూళ్లు.. అంతేనా?
కొత్త డైరెక్టర్స్‌కు ఎప్పుడూ అవకాశమిస్తూ, తమ ప్రతిభను చాటుకునే ఛాన్స్ ఇచ్చే రవితేజకు ఇలాంటి ఫ్లాప్ మూవీని ఇస్తావా అంటూ శరత్ మండవను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు నెటిజన్స్. ఇక ఈ ట్రోలింగ్‌పై ఇప్పటివరకైతే చిత్ర యూనిట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటించారు. వారి పాత్రలకు కూడా పెద్దగా స్కోప్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యిందని నెటిజన్లు శరత్‌పై ఫైర్ అవుతున్నారు.