Ramarao On Duty: రామారావుకు తప్పని లీకుల బెడద!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రేపు రిలీజ్ కానుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సమయంలో, ఈ చిత్రం నుండి ఓ వీడియో సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.

Ramarao On Duty: రామారావుకు తప్పని లీకుల బెడద!
ad

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ రేపు ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్’కు గట్టి షాక్ తగిలింది. ఈ సినిమా నుండి ఓ వీడియో సీన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.

Ramarao On Duty: రామారావు ఆ సినిమాకు మక్కీనా..?

రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని పలు సీన్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. రిలీజ్కు ముందు రోజు ఇలా తమ సినిమాలోని సీన్స్ లీక్ కావడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సీన్స్ ఖచ్చితంగా ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయినట్లుగా వారు చెబుతున్నారు. అయితే ఈ వీడియో సీన్స్ ఎవరు లీక్ చేశారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

Ramarao On Duty: రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

అయితే సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి లీకులు కావడంతో చిత్ర యూనిట్ పోలీసులను ఆశ్రయించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.