Ramarao On Duty: రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. టైటిల్ మొదలుకొని ట్రైలర్ వరకు ఆడియెన్స్‌లో ఈ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ కావడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.17.20 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

Ramarao On Duty: రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

Ramarao On Duty Pre Release Business Details

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మాస్ రాజా డిప్యూటీ కలెక్టర్ పాత్రలో అదిరిపోయే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను మడతెట్టేందుకు రవితేజ రెడీ అయ్యాడు.

Ramarao On Duty: సెన్సార్ ముగించుకున్న రామారావు.. రన్ టైమ్ ఎంతంటే?

దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. ఇక ఈ చిత్ర టీజర్స్, ట్రైలర్స్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు రవితేజ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే టీజర్ కట్స్‌ను రిలీజ్ చేయడంతో ఈ సినిమాలో ఇంకా ఎలాంటి సీక్వెన్సులు ఉన్నాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Ramarao On Duty: రామారావు మాస్ నోటిసు.. ఏముంటుందో?

అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండటం, ఇప్పటికే టైటిల్ మొదలుకొని ట్రైలర్ వరకు ఆడియెన్స్‌లో ఈ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ కావడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.17.20 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది మంచి ప్యాన్సీ రేటనే చెప్పాలి. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5 కోట్లు
సీడెడ్ – 3 కోట్లు
ఏపీ – 7 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఓవర్సీస్ – 1.2 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.17.20 కోట్లు