Ramarao On Duty: రామారావు ఆ సినిమాకు మక్కీనా..?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రిలీజ్ కు మరికొద్ది గంటలే ఉంది. అయితే ఈ సినిమా తెలుగులో వచ్చిన ఓ సూపర్ హిట్ మూవీకి మక్కీగా రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Ramarao On Duty: రామారావు ఆ సినిమాకు మక్కీనా..?

Is Raviteja Ramarao On Duty Similar To Mahesh Babu Bharat Ane Nenu

Updated On : July 28, 2022 / 3:19 PM IST

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కథ మరో సూపర్ హిట్ సినిమాకు మక్కీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Ramarao On Duty: రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

రామారావు ఆన డ్యూటీ సినిమా వేరొక సినిమా నుండి తీసుకున్న కథనా? అని మీరూ ఆలోచిస్తున్నారా. అయితే ఈ సినిమాకు సంబంధించిన అసలు విషయానికి వస్తే.. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా గతంలో టాలీవుడ్‌లో వచ్చిన ఓ సినిమాకు మక్కీగా రాబోతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన పొలిటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘భరత్ అనే నేను’ సినిమా కథనే అటుఇటు మార్చి ‘రామారావు ఆన్ డ్యూటీ’గా మనముందుకు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

Ramarao On Duty: సెన్సార్ ముగించుకున్న రామారావు.. రన్ టైమ్ ఎంతంటే?

ఆ సినిమాలోనూ మహేష్ సిన్సియర్ సీఎంగా నిజాయితీని చాటుతూ ప్రజలకు మంచి చేసే పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీలో కూడా రవితేజ దాదాపు అలాంటి పాత్రలోనే కనిపిస్తున్నాడు. మరి నిజంగానే ఈ సినిమా భరత్ అనే నేను సినిమాకు మక్కీగా రాబోతుందా.. లేక సినిమా కథలో దర్శకుడు ఏదైనా వైవిధ్యాన్ని చూపిస్తాడా అనేది తెలియాలంటే మాత్రం రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.