Ramarao On Duty: ఓటీటీలో రామారావు డ్యూటీ ఎక్కేది అప్పుడే!

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. కొన్ని చోట్ల ఈ సినిమాకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధం కండి అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Ramarao On Duty OTT Release Date Locked

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. కొన్ని చోట్ల ఈ సినిమాకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. ఇక ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ పవర్‌ఫుల్‌గా ఉందని ఆయన అభిమానులు తెలిపారు.

Ramarao On Duty: రామారావు దెబ్బ.. శరత్‌కు గట్టిగానే పడుతోందిగా!

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కాలేకపోవడంతో రవితేజ ఫ్యాన్స్ ఆయన నెక్ట్స్ మూవీ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే రామారావు ఆన్ డ్యూటీ నుండి ఓ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధం కండి అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్‌లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిపారు.

Ramarao On Duty: రామారావుకు తప్పని లీకుల బెడద!

ఈ విషయం తెలుసుకున్న మాస్ రాజా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేందుకు వారు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు చాలా కాలం తరువాత కమ్‌బ్యాక్ ఇవ్వడం విశేషం. కాగా దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. మరి ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి.