Ramarao On Duty: రామారావు ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు.....

Ramarao On Duty Trailer To Release On July 16
Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రవితేజ ఓ పవర్ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకలు తప్పకుండా ఫాలో అవుతున్నారు.
Ramarao On Duty: రామారావు మాస్ ట్రైలర్ లోడింగ్…!
ఎప్పుడెప్పుడా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేట్రికల్ ట్రైలర్‌ను ఎట్టకేలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కొంత గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ మాస్ ఆడియెన్స్‌కు ఎలాంటి పూనకాలు తెప్పిస్తుందో తెలియాలంటూ జూలై 16 వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఈ సినిమాను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Mass Maharaja @RaviTeja_offl is all set to unleash his MASSiest avatar ?#RamaRaoOnDuty Trailer on July 16th ??#RamaRaoOnDutyOnJuly29@directorsarat @divyanshaaaa @rajisha_vijayan @SamCSmusic @sathyaDP @sahisuresh @Cinemainmygenes @RTTeamWorks @LahariMusic pic.twitter.com/SUdxklP6Pe
— SLV Cinemas (@SLVCinemasOffl) July 12, 2022